ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష.. అందరూ ఫెయిల్‌!

ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష.. అందరూ ఫెయిల్‌!
x
Highlights

గోవాలో అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో ఒక్క అభ్యర్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. 80 అకౌంటెంట్ పోస్టుల భర్తీ కోసం గోవా ప్రభుత్వం 2017...

గోవాలో అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో ఒక్క అభ్యర్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. 80 అకౌంటెంట్ పోస్టుల భర్తీ కోసం గోవా ప్రభుత్వం 2017 చివర్లో ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంగ్లీష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, అకౌంట్స్‌ సంబంధిత ప్రశ్నలతో 100 మార్కులకు ఐదు గంటల సమయంతో జనవరిలో పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి మౌఖిక ఇంటర్వ్యూల ద్వారా తుది జాబితాను ఎంపికచేస్తామని నోటీఫికేషన్‌లో పేర్కొంది. కానీ ఏ ఒక్కరు అర్హత సాధించకపోవడంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. సుమారు 8వేల మంది గ్రాడ్యుయేట్లు ఈ పరీక్ష రాయగా.. వీరిలో ఏ ఒక్కరికి 100కు కనీసం 50 మార్కులు రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories