బాలు స్వరం యొక్క మధుర మత్తు

బాలు స్వరం యొక్క మధుర మత్తు
x
Highlights

అలివేణీ ఆణిముత్యమా అనే మధురమైన తెలుగు పాటని మీరు విన్నారా. ఇది ముద్ద మందారం (1981) సినిమాలోనిది. ఈ పాటకి శ్రీ రమేష్ నాయుడు గారు సంగీతం ఆందించగా,...

అలివేణీ ఆణిముత్యమా అనే మధురమైన తెలుగు పాటని మీరు విన్నారా. ఇది ముద్ద మందారం (1981) సినిమాలోనిది. ఈ పాటకి శ్రీ రమేష్ నాయుడు గారు సంగీతం ఆందించగా, వేటూరి సుందరరామ్మూర్తి గారి కలం నుండి జాలువారిన ఒక ఆణి ముత్యం. దీనిని శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్. జానకి గారు ఆలపించారు. ఈ పాటలో ప్రదీప్ మరియు పూర్ణిమ నటించారు.
అతడు :
అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతి వాన లేత ఎండలో
జాలినవ్వు జాజి దండలో
ఆమె :
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతి వాన లేత ఎండలో జాజిమల్లి పూలగుండెలో
అతడు : అలివేణీ ఆణిముత్యమా
చరణం 1:
కుదురైన బొమ్మకీ కులుకు మల్లెరెమ్మకీ ॥2॥
నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా
వద్దంటే ఒట్టుగా!
అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ ||2||
అడుగు మడుగులొత్తనా మెత్తగా
అవునంటే తప్పుగా!
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణముత్యమా
చరణం: 2 :
పొగడ లేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ ॥2॥
పొగడ దండలల్లుకోనా పూజగా
పులకింతల పూజగా!
తొలిజన్మల నోముకీ దొరనవ్వుల సామికీ ॥2॥
చెలిమై నేనుండిపోనా చల్లగా
మరుమల్లెలు చల్లగా!
అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా ఆఆ ఆఆ...
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతి వాన లేత ఎండలో జాజిమల్లి పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా
అలివేణీ ఆణిముత్యమా

ఇప్పటివరకు వినకుంటే ఒక సారి వినండి ...బాలు స్వరం...మిమ్మల్స్ని మైమరిపిస్తుంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories