విమానంలోంచి కిందపడిన మహిళా ఉద్యోగి..

nanireddy
Updated on: 24 Dec 2018 3:28 PM IST
విమానంలోంచి కిందపడిన మహిళా ఉద్యోగి..
X

ముంబై ఎయిర్‌పోర్టులో ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై సిద్ధంగా ఉన్న విమానం డోరును మూస్తూ ప్రమాదవశాత్తు ఫ్లైట్‌ అటెండెంట్‌ కిందపడింది. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన 53 ఏళ్ల హర్షా లోబో ఎయిరిండియాలో ఫ్లైట్‌ అటెండెంట్‌ గా పనిచేస్తోంది. సోమవారం బోయింగ్‌–777 విమానం డోర్‌ను మూసే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయారు. దాంతో ఆమె తల కాళ్లకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. వెన్తనె అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆమెను నానావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు, అధికారులు వెల్లడించారు.

nanireddy

nanireddy

Next Story