logo

స్తంభించిన శంషాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్‌

స్తంభించిన శంషాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్‌
Highlights

శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌‌పోర్ట్‌ స్తంభించింది. విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇండిగో ఫ్లైట్‌ ప్రమాదంతో...

శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌‌పోర్ట్‌ స్తంభించింది. విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇండిగో ఫ్లైట్‌ ప్రమాదంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆపరేషన్స్‌ నిలిచిపోయాయి. ఇప్పటికీ రన్‌వేను క్లియర్‌ చేయకపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో పలు విమానాలు రద్దు కాగా, మరికొన్ని గంటలతరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి.

శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌‌పోర్ట్‌ స్తంభించింది. విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి... తిరుపతి-హైదరాబాద్‌ ఇండిగో ఫ్లైట్‌ ప్రమాదానికి గురికావడం... ల్యాండింగ్‌ టైమ్‌లో టైరు పేలి మంటలు వ్యాపించడంతో... ఇంటర్నేషనల్‌ ఎయిర్‌‌పోర్ట్‌ స్తంభించిపోయింది. ప్రమాదానికి గురైన ఫ్లైట్‌ రన్‌వేపైనే నిలిచిపోవడంతో... విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో పలు ఫ్లైట్స్‌ను యాజమాన్యాలు రద్దు చేశాయి. మరికొన్ని విమానాలను దారి మళ్లించిన అధికారులు.... కొన్నింటిని ఆలస్యంగా నడుపుతున్నారు

అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరిగ్గా బయల్దేరాల్సిన సమయంలో విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్‌‌లో రాకపోకలు స్తంభించడంతో ఆ ఎఫెక్ట్‌ పలు విమానాశ్రయాలపైనా పడింది. ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి కూడా సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అయితే త్వరలోనే రన్‌వేను క్లియర్‌చేసి సర్వీసులను పునరుద్ధరిస్తామని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ప్రకటించారు.

రద్దైన ఫ్లైట్స్‌‌
బెంగళూర్‌ 6E 146
ఢిల్లీ G8 421
గోవా 6E 743
బెంగళూర్‌ 9W 806
విజయవాడ 6E 7201
భువనేశ్వర్‌ 6E 266
కోయంబత్తూర్‌ 6E 744
ఢిల్లీ 6E 6966
విశాఖపట్నం 6E 366
బెల్గాం SG 3562
కొచ్చిన్‌ 6E 683
విశాఖపట్నం 6E 879
జైపూర్‌ 6E 913
బెంగళూర్‌ 6E 527
ఢిల్లీ బెంగళూర్‌ 6E 845
విజయవాడ SG 1043
బెంగళూర్‌ 6E 187

ఆలస్యంగా నడుస్తోన్న పలు విమానాలు
ఢిల్లీ 6E 308
రాయపూర్‌‌ 9i 863
విజయవాడ SG 1003
ఢిల్లీ 6E 845
రాయపూర్‌‌ 6E 384
పాట్నా G8 663
తిరుపతి 6E 7112

లైవ్ టీవి

Share it
Top