ఆదివాసీ, లంబాడాల మధ్య రిజర్వేషన్ చిచ్చు

ఆదివాసీ, లంబాడాల మధ్య రిజర్వేషన్ చిచ్చు
x
Highlights

కొంత కాలంగా ఆదివాసీలు, లంబాడాల మధ్య రిజర్వేషన్ వివాదం నెలకొంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఆదివాసీలు తుడుందెబ్బ పేరుతో ఉద్యమం...

కొంత కాలంగా ఆదివాసీలు, లంబాడాల మధ్య రిజర్వేషన్ వివాదం నెలకొంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఆదివాసీలు తుడుందెబ్బ పేరుతో ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల్లో 70 శాతం లంబాడీలు ఉంటే మిగతా గిరిజన కులాలు 30 శాతం ఉన్నాయి. లంబాడాలు 25 లక్షల జనాభా ఉంటే ఆదివాసీలు 10 లక్షల మంది వరకు ఉన్నారు. కానీ ఉద్యోగాల్లో మాత్రం 90 శాతం లంబాడీలు ఉంటే 10శాతం ఆదివాసీలు ఉన్నారనే వాదన ఉంది. గిరిజనులకు ప్రభుత్వం నుంచి వస్తున్న హక్కులను అధిక భాగం లంబాడాలే అనుభవిస్తున్నారని, తాము వెనుకబడిపోతున్నామని ఇతర గిరిజన కులాలు ఆరోపిస్తున్నాయి.

మహారాష్ట్ర నుంచి వస్తున్న లంబాడీలు తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందుతున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. 1977 నుంచి పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చిన లంబాడీలు ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది ఎస్టీలుగా చలామణి అవుతూ ఉద్యోగాలు సంపాదిస్తున్నారని అంటున్నారు. మహారాష్టలో లంబాడాలు బిసీ కేటగిరిలో ఉంటారని, తెలంగాణలో లంబాడాలు గిరిజనులుగా ఉన్నారని, దాంతో అక్కడ నుంచి వచ్చి రిజర్వేషన్లు , ఇతర ప్రభుత్వ సదుపాయాలను పొందుతున్నారని వాపోతున్నారు. లంబాడాల వల్ల ఆదివాసుల ఉనికే ప్రశ్నార్థకనంగా మారిందని అంటున్నారు.

అయితే లంబాడాలు వలస వచ్చారనడం అన్యాయమని ఆ సామాజిక వర్గం నేతలు అంటున్నారు. లంబాడాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారనడం అవగాహన రాహిత్యమని చెబుతున్నారు. అన్నదమ్ముల్లా ఉన్న ఆదివాసీలు– లంబాడాల మధ్యలో చిచ్చుపెట్టి విభజించి–పాలించు అనే నినాదంతో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నలభై ఏళ్లకు పైగా ఎస్టీలుగా ఉన్నామని, రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ మార్చలేరని లంబాడా నేతలు వాదిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories