నటికి వేధింపులు.. డైరెక్టర్ ను తన్నిన అడిషినల్ డీసీపీ

నటికి వేధింపులు.. డైరెక్టర్ ను తన్నిన అడిషినల్ డీసీపీ
x
Highlights

సైబరాబాద్‌ అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగిని కాలుతో తన్నటం మీడియాలో హల్‌ చల్ చేస్తోంది....

సైబరాబాద్‌ అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగిని కాలుతో తన్నటం మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. సినీదర్శకుడు యోగి తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని, అసభ్య మెసేజ్ లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని హారిక అనే యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె పేర్కొంది. నిందితుడు యోగిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా అతను అటు యువతిని, ఇటు పోలీసులను దుర్బాషలాడినట్టు సమాచారం. దీంతో సహనం కోల్పోయిన అదనపు డీసీపీ గంగిరెడ్డి యోగిన స్టేషన్ లో చితకబాది వదిలేయగా మరింత రెచ్చిపోయిన యోగి పోలీసులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు యోగి ఆగడాలు మరింత పెరిగిపోవటంతో పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories