శ్రీరెడ్డి లీక్స్: వైవా హ‌ర్షాని బ‌జారుకీడ్చిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి లీక్స్: వైవా హ‌ర్షాని బ‌జారుకీడ్చిన శ్రీరెడ్డి
x
Highlights

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న న‌టి శ్రీరెడ్డి రోజుకో న‌టుడి వ్య‌క్తిగ‌త విష‌యాల్ని ఆధారాల‌తో స‌హా బ‌హిర్ఘ‌తం చేస్తుంది. అంతేకాదు తాను...

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న న‌టి శ్రీరెడ్డి రోజుకో న‌టుడి వ్య‌క్తిగ‌త విష‌యాల్ని ఆధారాల‌తో స‌హా బ‌హిర్ఘ‌తం చేస్తుంది. అంతేకాదు తాను చేస్తున్న పోరాటానికి ఇండ‌స్ట్రీ నుంచి మ‌ద్ద‌తులభించ‌డంలేద‌ని వాపోయింది. తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ
నిన్న అర్థనగ్నంగా ఫిల్మ్ చాంబర్ దగ్గర నిరసన తెలిపిన శ్రీరెడ్డి అందరికి పెద్ద షాకే ఇచ్చింది. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత... తన నిరసన కొనసాగుతుందని... త్వరలోనే అందరి గుట్టు విప్పుతానని చెప్పింది. చెప్పినట్లుగానే తన లీక్స్‌ను మొదలు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు త‌న‌ని ఏ విధంగా అణ‌గదొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారో వెల్ల‌డించింది.
ఇండ‌స్ట్రీ లోని పెద్ద‌ల వ‌ల్ల ఎంతోమంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని అన్నారు. అయినా మీ బెదిరింపుల‌కు బ‌య‌ప‌డేర‌క‌లం కాదు. నేను మీకు చాలా చిన్నగా కనిపించవచ్చు. కానీ నా పోరాటం చిన్నది కాదు. ఈక కూడా పీకలేదు అనే మొండి ధైర్యానికి హాట్సాఫ్ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
ఎప్ప‌టిలాగే ఇండ‌స్ట్రీ లోని కొంత‌మందిని టార్గెట్ చేస్తూ రోజుకో లీక్ తో సంచ‌ల‌నం సృష్టిస్తున్న శ్రీరెడ్డి వైవాహ‌ర్షా, అక్కోయ్ అంటూ నెట్టింట్లో ఓ పోస్టు పెట్టారు. ఇప్పుడా పోస్ట్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది.
అక్కా నువ్వు మంచి డాన్ అంట. ఎవరినైనా గోడౌన్‍‌లో వేసి కుమ్మిస్తావంట. అంకుల్స్ అందరికీ చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తావంట. నా జోలికి రాకు అక్కోయ్' అంటూ శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టారు. మరి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి? అనేది చర్చనీయాంశం అయింది.
యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన వైవా హర్ష గురించి శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టారు. షార్ట్ ఫిలింస్‌లో విషయంలో హెల్ప్ అడిగినందుకు అతడు ఎలా ప్రవర్తించాడో వెల్లడిస్తూ.... వాట్సాప్ చాటింగ్ విషయాలను ఆమె విడుదల చేశారు.
ఏదైనా చేసుకుని బ్రతకొచ్చుకదా అన్న వారికి ఇది నా సమాధానం. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, చివరకు షార్ట్ ఫిల్మ్స్ అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితులు ఎఉన్నాయి అని..... శ్రీరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories