తన సహజ నటనతో శాస్త్రీయ నృత్యంతో!

తన సహజ నటనతో శాస్త్రీయ నృత్యంతో!
x
Highlights

తన సహజ నటనతో శాస్త్రీయ నృత్యం తో...ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి శోభనగారు. ఈవిడ నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల...

తన సహజ నటనతో శాస్త్రీయ నృత్యం తో...ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి శోభనగారు. ఈవిడ నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో (అల్లుడుగారు, రౌడీగారు, ఇటీవల గేమ్) మొదలైనవారితో నటించింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది. 1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోను నటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. ఆమె చెన్నై లోని చిదంబరం నాట్య అకాడెమీలో శిక్షణ పొందినది. ఆమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ . భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories