logo
ఆంధ్రప్రదేశ్

నాటకాలు ఆపి పోరాటానికి కలిసిరండి: శివాజీ

నాటకాలు ఆపి పోరాటానికి కలిసిరండి: శివాజీ
X
Highlights

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కోసం గుంటూరు జిల్లాలో ఈ రోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకి...

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కోసం గుంటూరు జిల్లాలో ఈ రోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకి చలసాని శ్రీనివాసరావు, సీపీఐ రామకృష్ణ, సినీనటుడు శివాజీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ప్రజలు రోడ్లపై వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు నాటకాలు ఆపి పోరాటానికి కలిసిరావాలని నటుడు శివాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ వెంట్రుకతో సమానంగా పోల్చుతుందన్నారు. ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.


Next Story