ఎమ్మెల్యే చింతమనేనిపై సినీనటి అపూర్వ ఆరోపణలు...విడాకులు తీసుకున్న తన భర్తతో ...

x
Highlights

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై సినీనటి అపూర్వ వివాదం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అనుచరులతో కలిసి తనను బెదిరిస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌...

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై సినీనటి అపూర్వ వివాదం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అనుచరులతో కలిసి తనను బెదిరిస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదుట దిమ్మె కడుతున్న సమయంలో రేగిన స్వల్ప వివాదంలో చింతమనేని తనను టార్గెట్ చేసుకున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే విడాకులు తీసుకున్న తన భర్త ద్వారా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో ఆమె వివరించారు. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులకు అందజేసినట్టు ఆమె తెలిపారు. ఆధారాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్టు అపూర్వ తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారంటున్నారు సినీ నటి అపూర్వ. చింతమనేని గురించి తాను ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటున్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహారిస్తున్న వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తానన్నారు అపూర్వ.

Show Full Article
Print Article
Next Story
More Stories