మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ

nanireddy
Updated on: 24 Dec 2018 4:03 PM IST
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ
X

'ఆపరేషన్ గరుడ' అంటూ తీవ్ర చర్చకు తెరలేపిన హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన.. కొన్నిరోజులుగా వైసీపీనేతలు తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఇటీవల శివాజీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేసులు పెడతారేమోనన్న భావనతో శివాజీ అమెరికా పారిపోయాడని ఆమె విమర్శించారు. దానికి శివాజీ బదులిస్తూ.. తాను ఎక్కడికి పారిపోలేదని నవంబర్ 21న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తానన్నారు. కాగా వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని వ్యాఖ్యానించారు. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామంటూ.. అగంతకులు హెచ్చరిస్తున్నారు.. తనకు తన కుంటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ సీఎం, డీజీపీ ఠాకుర్‌లకు శివాజీ లేఖ రాశారు.

nanireddy

nanireddy

Next Story