‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ

‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ
x
Highlights

నిర్మాణ సంస్థ‌లు: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ, హ‌రి వెంక‌టేశ్వ‌ర పిక్చ‌ర్స్‌ తారాగ‌ణం: విశాల్‌, స‌మంత‌, అర్జున్‌, రోబో శంక‌ర్‌,...

నిర్మాణ సంస్థ‌లు: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ, హ‌రి వెంక‌టేశ్వ‌ర పిక్చ‌ర్స్‌
తారాగ‌ణం: విశాల్‌, స‌మంత‌, అర్జున్‌, రోబో శంక‌ర్‌, ఢిల్లీ గ‌ణేశ్ త‌దిత‌రులు
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
కూర్పు: రూబెన్స్‌
క‌ళ‌: ఉమేశ్ కుమార్‌
మాట‌లు: రాజేశ్ ఎ.మూర్తి
నిర్మాత‌: జి.హ‌రి
ద‌ర్శ‌క‌త్వం: పి.ఎస్‌.మిత్ర‌న్‌
విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకోవడంలో హీరో విశాల్‌ది ప్రత్యేకమైన శైలి. పందెం కోడి నుంచి గత చిత్రం వరుకు ఆయన అభిరుచిని గుర్తు చేశాయి. ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. తాజాగా విశాల్ నటించిన చిత్రం అభిమన్యుడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత అక్కినేని, యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలను పోషించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఇరంబు తిరై చిత్రానికి ఇది డబ్బింది. జూన్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి స్పందనను సొంతం చేసుకొన్నదో అనే విషయాన్ని తెలుసుకొవాలంటే కథలోకి వెళ్లాల్సింది.

కథ: తన తండ్రి అప్పులు చేయడం, అప్పులవాళ్లు ఇంటికి వచ్చి అడిగితే తప్పించుకొని తిరగడం వంటి విషయాలు కరుణాకరన్ (విశాల్) అలియాస్ కర్ణను బాగా ఇబ్బంది పెడతాయి. దీంతో పన్నెండేళ్లకే ఇంటి నుండి వెళ్ళిపోతాడు. మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్‌గా జీవితం గడుపుతుంటాడు. విపరీతమైన కోపం ఉండే కర్ణను ఏంగర్ మేనేజ్మెంట్‌లో సర్టిఫికేట్ తీసుకురావాలని మిలిటరీ అధికారులు ఆర్డర్ వేస్తారు. దానికోసం లతాదేవి (సమంతా) అనే సైకియాట్రిస్ట్‌ను కలుస్తాడు. ఆమె సలహాల మేరకు నెల రోజుల పాటు సొంతూరు వెళ్లి గడపాలని నిర్ణయించుకుంటాడు. అక్కడకు వెళ్లిన తరువాత తన చెల్లెలకు పెళ్లి చేయాలసిన బాధ్యత తన మీద ఉందని తెలుసుకుంటాడు. తన దగ్గర పెళ్లికి కావల్సినంత డబ్బు లేకపోవడంతో బ్యాంక్‌లో లోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎక్కడా లోన్ దొరకకపోతే ఓ ఏజెంట్ సహాయంతో ఫేక్ సర్టిఫికేట్స్‌తో తన తండ్రి పేరు మీద ఆరు లక్షల లోన్ తీసుకుంటాడు. డబ్బు అకౌంట్ లోకి వచ్చిన మరుసటి రోజునే ఆరు లక్షలతో పాటు తన అకౌంట్‌లో ఉన్న మరో నాలుగు లక్షలు మొత్తం పది లక్షల రూపాయలు మాయమైపోతాయి. ఇలా డబ్బు పోగొట్టుకుంది తను ఒక్కడు మాత్రమే కాదని చాలా మంది అమాయకులు ఇలానే నష్టపోయారని తెలుసుకుంటాడు. దీనంతటికీ కారణం వైట్ డెవిల్ (అర్జున్) అని కర్ణకు తెలుస్తుంది. ఇంతకీ ఈ వైట్ డెవిల్ ఎవరు..? ఎవరికీ తెలియని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అతడికి ఎలా తెలుస్తుంది..? కర్ణ ఇతడిని ఎలా ఎదుర్కొన్నాడు..? అనేదే సినిమా.

నటీనటులు : విశాల్‌ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మిలటరీ ఆఫీసర్‌గా విశాల్‌ లుక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర ప్రతినాయకుడు అర్జున్‌. వైట్‌ డెవిల్‌ పాత్రకు అర్జున్‌ వంద శాతం న్యాయం చేశాడు. అర్జున్‌ను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఉంది ఆయన నటన. ముఖ్యంగా విశాల్‌, అర్జున్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్‌. హీరోయిన్‌ సమంత రెగ్యులర్‌ కమర్షియల్ సినిమా హీరోయిన్‌ పాత్రే. పాటలు, కామెడీ సీన్స్‌ తప్ప ఆ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవటానికేం లేదు.

విశ్లేషణ : దర్శకుడు మిత్రన్‌ నేటి డిజిటల్‌ లైఫ్‌కు తగ్గ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాల్ బాడీ లాంగ్వేజ్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా అభిమన్యుడు సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సైబర్‌ క్రైమ్‌ కు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కించేందుకు మిత్రన్‌ చేసిన పరిశోధన తెర మీద కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎలా చోరికి గురవుతుందన్న అంశాలను చాలా బాగా చూపించాడు. అయితే హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు తొలి భాగంలో చాలా సేపు రొటీన్‌ సన్నివేశాలతో బోర్‌ కొట్టించాడు. అసలు కథ మొదలైన తరువాత సినిమా వేగం అందుకుంటుంది. అయితే పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన కథ కావటంతో సామాన్య ప్రేక్షకులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో చూడాలి. యువన్‌ శంకర్‌ రాజా థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన ఇంటెన్స్‌ మ్యూజిక్‌ తో మెప్పించాడు. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. జార్జ్‌ సీ విలియమ్స్‌ తన కెమెరా వర్క్‌తో సినిమా మూడ్‌ను క్యారీ చేశారు. అయితే ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో అనవసర సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories