ఆ నలుగురు సినిమా

ఆ నలుగురు సినిమా
x
Highlights

చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో.. వచ్చిన ఒక గొప్ప సందేశంతో వచ్చిన సినిమా....ఆ నలుగురు. ఈ సినిమా 2004లో వచ్చిన ఓ ప్రత్యెక సినిమా. మంచి కథా బలంతో...

చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో.. వచ్చిన ఒక గొప్ప సందేశంతో వచ్చిన సినిమా....ఆ నలుగురు. ఈ సినిమా 2004లో వచ్చిన ఓ ప్రత్యెక సినిమా. మంచి కథా బలంతో నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన నంది ఉత్తమ చిత్రం ఇది. పరుల సేవయే పరమార్థంగా భావించే రఘురాం (రాజేంద్ర ప్రసాద్), అనే పత్రికా సంపాదకుడి కథ ఇది. రఘురాం చనిపోయిన తరువాత అతని ప్రాణాలు తీసుకొని పోవడానికి యమ కింకరులు (చలపతి రావు, రఘు బాబు) రావడంతో కథ ప్రారంభమవుతుంది. తను చనిపోయిన తరువాత తన కోసం కుటుంబ సభ్యులు ఎలా బాధ పడతారో చూడాలని ఆ యమ కింకరులను వేడుకుంటాడు. తన శవం పట్ల అతని కన్న బిడ్డలే చూపిన నిర్లక్ష్యం పట్ల యమకింకరులు అతన్ని హేళన చేస్తారు. కానీ బతికి ఉన్నపుడు ఎంతో మందికి సహాయం చేసిన రఘురాంకు నివాళులు అర్పించేందుకు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు. అతని దగ్గర సహాయం పొందిన వారు అతని కొడుకులకు కూడా బుద్ధి చెపుతారు. అప్పుడు రఘురాంకు తనతో పాటు ఉన్న వారు యమ కింకరులు కారనీ, ప్రశాంతత చెందిన మనస్సుతో చూస్తే వారు దేవదూతలౌతారని తెలుసుకుంటాడు. ఆ దేవ దూతలు రఘురాంను స్వర్గానికి కొనిపోవడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమా మీరు ఇప్పటివరకు చూడకుంటే..తప్పక చూడాల్సిన సినిమా. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories