చిన్నారి ప్రాణాలు తీసిన జెయింట్ వీల్

చిన్నారి ప్రాణాలు తీసిన జెయింట్ వీల్
x
Highlights

అనంతపురం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఉన్న జెయింట్ వీల్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆనందాన్ని ఇస్తుందని ఆ జెయింట్ వీల్ ను ఎక్కిన...

అనంతపురం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఉన్న జెయింట్ వీల్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆనందాన్ని ఇస్తుందని ఆ జెయింట్ వీల్ ను ఎక్కిన చిన్నారులకు చేదు జ్ఞాపకాన్ని ఇచ్చింది. అలాగే ఓ చిన్నారి ప్రాణాలు పోయాయి.
అనంతపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన రోబో ఎగ్జిబిషన్ లో జరిగిన ప్రమాదంలో అమృత అనే 8 ఏళ్ళ చిన్నారి మరణించింది. మరో ఆరుగురు పిల్లలు గాయపడ్డారు. వీరు ఎక్కిన భారీ జెయింట్ వీల్ బోల్ట్ వదులై..ఒక్కసారిగా రెండు బాక్సులు ఊడి 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాయి.

ఈ ప్రమాదంలో ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన రాజు కుమార్తె అమృత గాయపడి మృతి చెందింది. ఈ ఘటన జరిగిన తరువాత కూడా ఎగ్జిబిషన్ నిర్వాహకులు పట్టించుకోకుండా యధావిధిగా ఎగ్జిబిషన్ కొనసాగించడంపై స్థానికులు మండిపడ్డారు. జెయింట్ వీల్ ఆపరేటర్ రఘు మద్యం మత్తులో ఉన్న విషయం తెలుసుకుని అతడ్ని చితకబాదారు. వారి ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories