ఒంటిమిట్టలో కలకలం.. ఏడు మృతదేహాలు లభ్యం

ఒంటిమిట్టలో కలకలం.. ఏడు మృతదేహాలు లభ్యం
x
Highlights

కడప జిల్లా ఒంటిమిట్టలోని చెరువులో మృతదేహాలు కలకలం సృష్టించాయి. రేణిగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఈరోజు స్థానికులు ఏడు మృతదేహాలను...

కడప జిల్లా ఒంటిమిట్టలోని చెరువులో మృతదేహాలు కలకలం సృష్టించాయి. రేణిగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఈరోజు స్థానికులు ఏడు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మృతదేహాలను వెలికి తీయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మృతులు ఎర్రచందనం కూలీలుగా అనుమానిస్తున్నారు.

శనివారం రాత్రి ఎర్రచందనం అక్రమ రవాణా జరుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఓ ఎర్ర చందనం లారీ తారసపడింది. ఇందులో 30 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా, వారిలో కొంత మంది కూలీలు చెరువులోకి దూకి ఉంటారని భావిస్తున్నారు. ఊపిరి ఆడక మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories