ఐదు రూపాయలిచ్చి అత్యాచారం.. అరవై ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం

ఐదు రూపాయలిచ్చి అత్యాచారం.. అరవై ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం
x
Highlights

చిన్నా.. పెద్దా.. అన్న తేడా లేకుండా చిన్నారులు, మహిళలపై మృగాళ్ల లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 60...

చిన్నా.. పెద్దా.. అన్న తేడా లేకుండా చిన్నారులు, మహిళలపై మృగాళ్ల లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు ఇద్దరు మైనర్‌ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని పాలం ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడు తన ఇంటిపక్కనే ఆడుకుంటున్న ఐదు, తొమ్మిది సంవత్సరాలున్న ఇద్దరు చిన్నారులను స్వీట్లు ఇస్తానని ఇంట్లోకి పిలిచి వారిపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ వారికి 5 రూపాయలు ఇచ్చాడని ఢిల్లీ డీసీపీ మిలింద్‌ మహదేవ్‌ తెలిపారు. బాలికలు రోదిస్తూ జరిగిన దారుణాన్ని తల్లితండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి బాలికలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు డీసీపీ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories