కొండగట్టు మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

కొండగట్టు మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా
x
Highlights

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున...

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం కేసీఆర్. మంగళవారం ఉదయం కొండగట్టు ఘాట్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. కొండగట్టు ఘాట్‌రోడ్డు చివరి మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరికొద్ది క్షణాల్లో బస్సు ప్రధానరహదారికి చేరతుందగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories