‘అమ్మ’లకు పరీక్ష: పరీక్ష రాసిన 47వేల మంది మహిళలు

‘అమ్మ’లకు పరీక్ష: పరీక్ష రాసిన 47వేల మంది మహిళలు
x
Highlights

అమ్మలు బడిబాట పట్టారు..! ఒక్కరు కాదు ఇద్దరు కాదు... 47వేల మంది మహిళలు పాఠశాలలకు వచ్చి పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీల్లోని...

అమ్మలు బడిబాట పట్టారు..! ఒక్కరు కాదు ఇద్దరు కాదు... 47వేల మంది మహిళలు పాఠశాలలకు వచ్చి పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీల్లోని పాఠశాలల్లో ఆదివారం ఉదయం పరీక్ష రాస్తున్న మహిళలే కనిపించారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు పరీక్షలు రాయడమేమిటీ..? ఏం పరీక్షలు అని అనుకుంటున్నారు కదా..? ఇటీవలే బదిలీపై వెళ్లిన కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ ప్రయోగాత్మకంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వారి పిల్లలు చదువు నేర్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
2017 మార్చిలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా.. 50వేల మంది మహిళలు చదువు నేర్చుకున్నారు. ఆదివారం ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించగా 47 వేల 084 మంది మహిళలు హాజరయ్యారు. మహిళలంతా ఉత్సాహంగా పరీక్షలు రాశారు. 15 రోజుల్లో మహిళలందరికీ ఓపెన్ స్కూల్ నుంచి సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. అత్యధికంగా పటాన్‌చెరు మండలంలో 3వేల 878 మంది మహిళలు పరీక్ష రాయటం విశేషం.

47 thousand women write open school exam in sangareddy telangana

అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా జిల్లాలో మొత్తం 50వేల మంది వరకు మహిళలు చదువు నేర్చుకున్నారు. జిల్లాలో 20 వేల 334 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. వీటిలో 2 లక్షల మంది మహిళా సభ్యులున్నారు. చాలా మంది నిరక్షరాస్యులు. వీరికి చదువు నేర్చించాలని భావించారు అప్పటి కలెక్టర్. ఇందులో భాగంగానే గత ఏడాది వేసవి సెలవులకు ముందు అమ్మకు అక్షరమాల కార్యక్రమం తీసుకువచ్చారు. వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఉండే విద్యార్థినీ, విద్యార్ధులు తమ తల్లులకు చదువు నేర్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఐకేపీ, సాక్షరభారత్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వర్ణమాల, రెండు, మూడు అక్షరాల పదాలు, చిన్న లెక్కలు నేర్పించారు.

అమ్మకు అక్షరమాల కింద ప్రతి రోజు రాత్రి చదువు నేర్చుకున్నామని తెలిపారు మహిళలు. గ్రామాల్లో అందరం నాలుగు పుస్తకాలను చదువుకున్నామని.. అమ్మకు అక్షరమాలలో చదువు నేర్చుకోవడం వల్ల ఇన్నాళ్లు చదువురాదనే బాధను అదిగమించామని సంతోషం వ్యక్తం చేశారు మహిళలు.

Show Full Article
Print Article
Next Story
More Stories