పౌరసత్వ కేసు నుంచి చెన్నమనేనికి తాత్కాలిక ఊరట

పౌరసత్వ కేసు నుంచి చెన్నమనేనికి తాత్కాలిక ఊరట
x
Highlights

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2009లో కేంద్రం...

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2009లో కేంద్రం ఆయనకు కేటాయించిన భారత పౌరసత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం, ఆ వెంటనే కేంద్రం ఆ ఆదేశాలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం త్వరత్వరగా జరిగిపోయాయి. అయితే ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. హైద్రాబాద్ హైకోర్టు కేంద్రం ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఈ కేసులో చెన్నమనేనికి తాత్కాలిక ఊరట లభించింది. సుప్రీం కోర్టు తీర్పును పున: పరీక్షించాలన్న ఆయన అభ్యర్థనను పరిశీలించాలని సుప్రీం కోర్టుకు హైదరాబాద్ హైకోర్టు సూచించింది.

కేంద్రం తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా పౌరసత్వ ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు ఎమ్మెల్యే చెన్నమనేని వివరించారు. 1993లో తనకు చెన్నమనేని రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం లభించింది. అయితే చాలా సంవత్సరాల పాటు తాను కరీంనగర్‌లోనే ఉంటున్నానని, తనకు పౌరసత్వాన్ని మంజూరు చేయాలని ఆయన కోరడంతో 2009లో భారత పౌరసత్వాన్ని కేటాయిస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories