మరో మైలురాయిని చేరుకున్న జగన్ పాదయాత్ర

nanireddy
Updated on: 24 Dec 2018 4:06 PM IST
మరో మైలురాయిని చేరుకున్న జగన్ పాదయాత్ర
X

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. జగన్‌ పాదయాత్ర ప్రారంభించి నేటి(ఆదివారం)తో 300 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా పార్వతీపురంలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం పార్వతీపురం నియోజకవర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర…బంటువాణి వలస, అడ్డాపుశీల క్రాస్‌, సీతారంపురం, గురుగుపల్లి క్రాస్‌, రామినాయుడు వలస మీదుగా తోటపల్లి రాజర్వాయర్‌ వరకు కొనసాగింది. ప్రజా సంకల్పయాత్రలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా పాదయాత్ర మూడు వందల రోజులు పూర్తి చేసుకోవడంతో నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

nanireddy

nanireddy

Next Story