logo
జాతీయం

స్కూలు బస్సును ఢీకొన్న రైలు.. 13మంది మృతి

స్కూలు బస్సును ఢీకొన్న రైలు.. 13మంది మృతి
X
Highlights

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఢీకొట్టింది....

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 13మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు తునాతునకలైంది. డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సును థావే-కపటన్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలు బెహ్‌పుర్వా రైల్వే క్రాసింగ్‌ వద్ద ఢీకొట్టిందని రైల్వే అధికార ప్రతినిధి వేద్‌ ప్రకాశ్‌ వెల్లడించారు. రైలు సివాన్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది 10 సంవత్సరాల లోపు చిన్నారులే అని అధికారులు తెలిపారు. ఘటనలో బస్సు డ్రైవర్‌ కూడా చనిపోయాడని పోలీసు అధికారి ఓపీ సింగ్‌ వెల్లడించారు.

Next Story