మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రాధాన్యత కనబరుస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. హెల్త్ వెల్‌నెస్...
ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రాధాన్యత కనబరుస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. హెల్త్ వెల్‌నెస్ సెంటర్ల కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని, పదికోట్ల కుటుంబాలకు దీన్ని వర్తింపచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ఈసారి ఎక్కువగా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. మెడికల్ ఇన్సూరెన్స్‌తో పాటు కొత్తగా 24 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత కాలేజీలను కూడా ఆధునీకరించనున్నట్టు తెలిపారు. దీంతో దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చూసుకోనున్నారు.
మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా మెడిసిన్ అందించాలని నిర్ణయించింది. అందుకోసం దేశవ్యాప్తంగా లక్షా 05వేల వెల్ సెన్ సెంటర్లు ఏర్పాటు చేయటానికి నిర్ణయించింది. వీటి ద్వారా పేదలకు అవసరం అయిన మందులను ఉచితంగా అందిస్తారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.1,200 కోట్లు కేటాయించారు. ఆస్పత్రిపాలయ్యే వారికి ఆరోగ్య బీమా కల్పిస్తున్న సర్కార్.. ఉచితంగా మందులు కూడా అందించటానికి సంకల్పించింది.
ప్రపంచంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమంగా ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ఆయుష్మాన్‌భవ సహా పలు ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలను పరిపుష్టం చేస్తామని చెప్పారు. ఆరోగ్య రక్షణ పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, కానీ కావాల్సిన స్థాయిలో ఆరోగ్య సంరక్షణ అందించాలని తాము కోరుకుంటున్నట్టు జైట్లీ చెప్పారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT