నిజామాబాద్ ఆటో ప్రమాదానికి కారణం అదే!

నిజామాబాద్ ఆటో ప్రమాదానికి కారణం అదే!
x
Highlights

నిజామాబాద్ జిల్లా మెండోర శివారులో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 11 మందికి చేరింది. పరిమితికి మించి ప్రయాణికులను...

నిజామాబాద్ జిల్లా మెండోర శివారులో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 11 మందికి చేరింది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పెద్దలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. కొందరు బావిలోని మోటారు పైపులను పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌తో కలిపి ఆటోలో 20 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి డ్రైవర్ సహా 9 మంది బయటపడ్డారు.

ఆటో ప్రమాదంలో పదకొండు మంది జల సమాధి కావటానికి నీళ్ల సీసా కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరగటానికి ఒక నిమిషం ముందు ఆటో డ్రైవర్‌ నీళ్లు తాగేందుకని నీళ్ల సీసా మూత తీసేందుకు యత్నించాడు. ఆ క్రమంలో అది చేయి జారి ఎడమవైపున పడిపోయింది. ఆటో నడుపుతూనే దాన్ని ఎత్తుకునేందుకు కిందిగి వంగే ప్రయత్నంలో అతరి కుడిచేతిలోని ఎక్సలరేటర్‌ పైకి నొక్కాడు. ఫలితంగా ఆటో వేగం పెరగడం..అదుపుతప్పటం అంతా క్షణాల్లో జరిగిపోయిందని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు వాపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories