Uttam Kumar comment on Revanth Reddy Arrest: రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అరాచకం. అప్రజాస్వామికం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు.
శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ కేంద్రం వద్ద జరిగిన సంఘటన ను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి లను అరెస్ట్ చేయడం దారుణం, అరాచకం, అప్రజాస్వామికం..
ప్రజాప్రతినిధులు గా సంఘటనను పరిశీలించడం, బాధితులను పరామర్శించడం కనీస బాధ్యత..
తెలంగాణ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తుంది. ప్రభుత్వ తప్పిదాలు బయట పడతాయని పోలీసులను ప్రభుత్వం ఉపయోగించి నిర్బందానికి పాల్పడుతోంది..
రేవంత్, మల్లు రవి లను వెంటనే విడుదల చేసి శ్రీశైలం సంఘటన స్థలాన్ని సందర్శించే విధంగా ఏర్పాటు చేయాలి..
Next Story



