Donald Trump To JD Vance: జేడి వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్ వైపు తిరిగి కిక్కిచ్చే మాట చెప్పిన డోనల్డ్ ట్రంప్.. ఇంతకీ ఆయనేం చెప్పారు?

HMTV
By HMTV
Published on: 2024-11-06 09:05:30

Donald Trump Shoutouts To JD Vance After US Election 2024 Results: అమెరికా అధ్యక్షుడిగా గెలిచానన్న ఆనందంలో డోనల్డ్ ట్రంప్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అదే ఆనందంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద భారీ సంఖ్యలో గుడిగూడిన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా మనకు భారీ మద్దతును ఇచ్చిందన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యావాదాలు చెప్పారు. ఆ క్రమంలోనే రిపబ్లికన్స్ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న జేడి వాన్స్‌ని కూడా ఆయన ప్రశంసించారు. ఇకపై మిమ్మల్ని వైస్ ప్రెసిడెంట్ అని పిలవొచ్చు అని వ్యాఖ్యానించారు.

రిపబ్లికన్స్ విజయం కోసం జేడి వాన్స్ పనిచేసిన తీరును అభినందించారు. జెడి వాన్స్, ఆయన భార్య ఉష చిలుకూరి వాన్స్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉష చిలుకూరి వాన్స్ భారత సంతతి మహిళ అనే విషయం తెలిసిందే. జేడి వాన్స్‌ని వైస్ ప్రెసిడెంట్ అని పిలిచిన అనంతరం, అదే వేదికపై ఆయన అభిప్రాయం చెప్పాల్సిందిగా మైక్ వద్దకు ఆహ్వానించారు. ఈ వార్త ప్రచురించేటప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం డోనల్డ్ ట్రంప్ 270 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ 214 స్థానాల వద్ద ఉన్నారు.

HMTV

HMTV

Next Story