US Elections 2024: అమెరికా ప్రెసిడెంట్ ఎవరో అప్పుడే చెప్పేసిన బేబి హిప్పో

HMTV
By HMTV
Published on: 2024-11-05 08:39:44

Thailand baby pygmy hippo Moo Deng predicted US presidential election results: ఇప్పుడు అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే నెలకొంది. అమెరికా అధ్యక్షురాలిగా గెలిచి కమల హరీస్ చరిత్ర సృష్టిస్తారా? లేదంటే మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేత సౌధంలో అడుగుపెట్టాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఫలిస్తాయా? అనే విషయంపై అమెరికన్లు తమ ఓటు హక్కుతో తీర్పు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. థాయ్‌లాండ్ జూలోని పిగ్మీ హిస్పో (నీటి గుర్రం) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పేసింది.  

ఈ హిప్పోను అక్కడి జనం చాలా మంది నమ్ముతారు. గతంలో పలు సందర్భాల్లో హిప్పో చెప్పిన జోస్యం నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయనేది వారి వాదన. ఇవాళ అమెరికా ఎన్నికల నేపథ్యంలో డోనల్డ్ ట్రంప్, కమలా హరీస్‌లలో ఎవరు గెలుస్తారో అని రెండు పుచ్చకాయల కేకులను సెపరేట్‌గా ఉంచారు. ఒక దానిపై డోనల్డ్ ట్రంప్, మరోదాని పై కమలా హరీస్ పేరును రాసి హిప్పో ముందు ఉంచారు. అప్పుడు హిప్పో ఏం చేసిందనే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

HMTV

HMTV

Next Story