Union Budget 2026 Live Updates:ప్రజల మద్దతుతో రూపుదిద్దిన యువశక్తితో కూడిన ‘వికసిత్ భారత్ 2047’ బడ్జెట్

HMTV
By HMTV
Published on: 2026-02-01 05:42:34

బడ్జెట్ పార్ట్–A ప్రసంగంలో భాగంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వంతో బలంగా నిలిచారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వికసిత్ భారత్‌–2047 లక్ష్యాన్ని సాధించే దిశగా కొత్త నాయకత్వం, యువశక్తితో కూడిన బడ్జెట్ రూపకల్పనకు ప్రోత్సాహం లభించిందని ఆమె తెలిపారు.

కర్తవ్య భవన్‌లో రూపొందించిన తొలి బడ్జెట్ ఇదేనని పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, పోటీ తత్వాన్ని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధితో పాటు అందరికీ అభివృద్ధిని చేరవేయడమే ఈ బడ్జెట్ ఉద్దేశమని తెలిపారు.

అలాగే నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేస్తామని, ప్రజల్లో సేవింగ్స్‌ను పెంచే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహిస్తూ దేశాన్ని భవిష్యత్తు దిశగా తీసుకెళ్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

HMTV

HMTV

Next Story