Tribute to Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సిపిఐ సురవరం సంతాపం

HMTV
By HMTV
Published on: 2020-08-31 14:38:38

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సిపిఐ నాయకులు సంతాపం..

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు....

దాదాపు 5 దశాబ్దాలుగా ఆయనతో నాకు పరిచయం ఉన్నది. ఆయన ప్రారంభించిన నిరక్షరాస్యత నిర్మూలన కమిటీ లో నేను కూడా సభ్యుడిగా ఉండే వాడిని....

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మంత్రివర్గంలో విభిన్న పోర్ట్ పోలియోలతో ఆయన అత్యంత సమర్ధవంతంగా పని చేశారు...

రాష్ట్రపతిగా ఆయన బాధ్యత నుండి విరమించిన తర్వాత రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభకు నన్ను కూడా ఆహ్వానించారు....

సెక్యులర్ భావాల పట్ల నిబద్ధత, చివరివరకూ జాతి సమైక్యత కోసం ఆయన గొప్ప కృషి చేశారు..

ఆయనకు శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సురవరం సుధాకర్ రెడ్డి తెలియజేశారు...

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి , సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజిత్ పాషా, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ గారలు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పట్ల సంతాపాన్ని తెలియజేశారు....

ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడు అని, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కోసం కృషి చేశారని, లౌకిక వ్యవస్థను కాపాడటంలో గర్వకారణమైన పాత్ర నిర్వహించారని కొనియాడారు...

వారికి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

HMTV

HMTV

Next Story