Suspension on Ongole CI: ఒంగోలు సీఐ‌పై సస్పెన్షన్ వేటు

HMTV
By HMTV
Published on: 2020-08-21 07:14:57

ప్రకాశం: ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

సివిల్ కేసులు, పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలపై సీఐ లక్ష్మణ్‌పై జిల్లా ఎస్పీ సిద్ధార్ట్ కౌశల్ విచారణకు ఆదేశించారు.

ఆరోపణలపై ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు.

విచారణ నివేదికతో పాటు ఎస్పీ సిఫారసు మేరకు సీఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు ఉత్తర్వులు జారీ చేశారు.

పామూరు సీఐగా పనిచేస్తున్న శివరామకృష్ణారెడ్డిని ఒంగోలు తాలూకా సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

HMTV

HMTV

Next Story