Somu Veerraju: 2024 లో మళ్ళీ బిజేపి సర్కారే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

HMTV
By HMTV
Published on: 2020-09-07 14:05:36

విశాఖ: 2024 లో మళ్ళీ బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  అన్నారు. 

తప్పకుండా ఈ సారి విశాఖ కార్పొరేషన్ బిజేపి కైవసం చేసుకుంటుంది.

జనతాదళ్ నుంచి బయటకు వచ్చిన తరువాత బిజేపి దక్షిణ భారతదేశంలో విశాఖ కార్పొరేషన్ లో, మొదటిసారిగా విజయకేతనం ఎగురు వేసింది.

బిజేపి ప్రభుత్వం చైనాను గడగడలాడించింది. అలాంటి బిజేపి సారధ్యంలో మరిన్ని విజయాలు సాధించాలి.

ఈ రాష్ట్ర రాజకీయాలలో బిజేపి, జనసేన కలసి మార్పులు తీసుకొస్తాయి.

రాబోయే రోజుల్లో సంయుక్తంగా ముందుకు వెళ్తాము. 

మేము కూడా రాజకీయాలను శాసిస్తాం.

నేడు వెన్నుపోటు రాజకీయాలు చూసి ఎందుకు భయపడాలి.  

1982 ఒక వాహనం పై యాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్.

ఇందిరా మృతి చెందిన సమయం దేశంలో కాంగ్రెస్ గాలి ఉంటే ఒక్క ఆంధ్ర ప్రదేశ్లో టిడిపి గెలిచింది, కేంద్రంలో ప్రతిపక్ష స్థానం లో పనిచేసింది.

ఇప్పుడు రాజకీయాలను డబ్బు నడుపుతోంది.అలాంటి రాజకీయాలను పాలద్రోలుతాం.

మేము ఓట్లు కోసం ,సీట్లు కోసం లెము. దేశం కోసం , సమాజం కోసం ఉన్నాము.

HMTV

HMTV

Next Story