Revanth Reddy Fire on TS govt: ఇవి ప్రమాద మరణాలు కాదు... ప్రభుత్వ హత్యలు: రేవంత్ రెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-08-23 17:05:41

శ్రీశైలం దుర్ఘటనలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈ ఫాతిమా కుటుంబాలను పరామర్శించిన ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ.

శ్రీశైలం ఘటనకు మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు నిర్లక్ష్యమే కారణం.

ప్రమాదం పొంచి ఉందని క్షేత్ర సిబ్బంది రెండు రోజుల క్రితమే లేఖ రాసినా స్పందించ లేదు.

ఇవి ప్రమాద మరణాలు కాదు... ప్రభుత్వ హత్యలు

మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుల పై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు పెట్టి, అరెస్టు చేయాలి.

వీరిద్దరిని పదవుల్లో కొనసాగిస్తే ఘటనకు కేసీఆర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ లోనే ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించని కేసీఆర్ కు అసలు మానవత్వం ఉందా

కేసీఆర్ కంటే రోశయ్యే నయం

80 ఏళ్ల వయస్సులో సీఎంగా శ్రీశైలం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు

మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, హైదరాబాద్ లో 500 గజాల స్థలం ఇవ్వాలి

ఘటన పై సీబీఐ విచారణ జరగాలి

HMTV

HMTV

Next Story