Drunk Ambulance Driver Hulchul In Kakinada: కాకినాడలో అంబులెన్స్ డ్రైవర్ బీభత్సం

HMTV
By HMTV
Published on: 2020-08-23 16:08:24

తూర్పుగోదావరి : కాకినాడ భానుగుడి జంక్షన్ లో ప్రభుత్వ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ అంబులెన్స్ బీభత్సం..

తప్పతాగి తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను నడుపుతున్న డ్రైవర్..

రోడ్డు పై నడిచి వెళుతున్న మహిళను అంబులెన్స్ తో ఢీ కొట్టిన డ్రైవర్.. స్వల్ప గాయాలతో బయట పడ్డ మహిళ.

పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో డివైడర్ ను ఢీ కొట్టిన అంబులెన్స్ డ్రైవర్.. అడ్డుకున్న స్థానికులు, పోలీసులు..

మద్యం మత్తులో స్థానికులు, పోలీసులతో వాగ్వివాదంకు దిగిన అంబులెన్స్ డ్రైవర్..

అంబులెన్స్ డ్రైవర్ కు దేహ శుద్ధిచేసిన స్థానికులు..

ఆ సమయంలో అంబులెన్స్ లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు.

అంబులెన్స్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న, విచారిస్తున్న ట్రాఫిక్ పోలీసులు..

HMTV

HMTV

Next Story