Maharashtra Election Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎవరిది పై చేయి.. కాబోయే సీఎం ఎవరు?

HMTV
By HMTV
Published on: 2024-11-23 07:36:15

Maharashtra Election Results 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో మధ్యాహ్నం 12 గంటల సమయానికే మహాయుతి కూటమి 222 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రలో ఒక కూటమి 200 స్థానాలకుపైగా స్థానాల్లో విజయం సాధించడం ఇదే తొలిసారిగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో అధికారంలోకి రావాలంటే 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. కానీ మహాయుతి అంతకుమించిన ఘన విజయం సొంతం చేసుకుంది. మహాయుతి కూటమిలో బీజేపి, సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సరళిపై పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

HMTV

HMTV

Next Story