అమరావతిచిత్తూరు టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-26 06:25:29

అమరావతి

చిత్తూరు టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ నాయకుల గృహ నిర్భంధాలను ఖండించిన చంద్రబాబు

హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ మహాపాదయాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికం.

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న టీడీపీపై అణచివేత చర్యలను ఖండిస్తున్నాను.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం.

అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నాం.

తక్షణమే టీడీపీ నాయకులపై గృహనిర్బంధం ఎత్తివేయాలి. అక్రమ కేసులను తొలగించాలి.

రైతాంగ వ్యతిరేక చర్యలకు వైసీపీ స్వస్తి చెప్పాలి. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి తక్షణమే పరిష్కరించాలి.

హంద్రీ-నీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.

*నారా చంద్రబాబు నాయుడు,

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు*

HMTV

HMTV

Next Story