అమరావతిట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 07:51:17

అమరావతి

ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

కూల్చివేతల జగన్ రెడ్డి రాక్షస ఆనందానికి అడ్డు, అదుపు లేదు.సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుంది.

జగన్ రెడ్డి కి విధ్వంసం కిక్ ఇస్తుంది.

సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ట.

కరోనా కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సేవలు అందించింది గీతం ఆసుపత్రి.

ఎన్నో ఏళ్లుగా విద్యా, బుద్ధులు నేర్పి ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్సిటీ పై విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతోంది.

కనీసం నోటీసు ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారు.

మొన్న సబ్బం హరి గారి ఇల్లు, నేడు గీతం యూనివర్సిటీ.

పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డి.విశాఖ లో విధ్వంసం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచెయ్యడమే జగన్ రెడ్డి లక్ష్యం.

HMTV

HMTV

Next Story