సోషలిస్టు సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
సోషలిస్టు సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి నాయిని - జస్టిస్ సుదర్శన్ రెడ్డి
నాయిని నరసింహారెడ్డి గారి మరణంతో తెలుగు ప్రజలు, భారత దేశం ఒక గొప్ప సోషలిస్టు యోధుడిని కోల్పోయింది. సోషలిస్టు సిద్ధాంతాలకూ, విలువలకూ కట్టుబడి పనిచేసిన ఒక గొప్ప నాయకుడు నాయిని. త్యాగానికీ, పట్టుదలకూ ఆయన ఒక చిహ్నం. పేదల పక్షాన పోరాడే ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం విచారకరం. సోషలిస్టు ఉద్యమంలో లోహియా అనుచరుడిగా, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు విలువైనవి. ఆయన కుటుంబానికీ, అభిమానులకూ, ప్రజలకూ నా ప్రగాఢ సంతాపం.
Next Story



