#కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరి శ్రీ ప్రవీణ్... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 07:49:31

#కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరి శ్రీ ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో భేటి.

ఉదయం బిఆర్ కెఆర్ భవన్ లో కలిసి రాష్ట్రంలో వరదల పరిస్ధితి, చేపడుతున్న  సహాయక చర్యల పై చర్చించారు.

రాష్ట్రంలో వరదలు, వర్షాల వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది.

కమిటి రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రాష్ట్రంలో  ఆస్తులకు, పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. 

 

#కేంద్ర బృందంలో  ప్రవీణ్ వశిష్ట తో పాటు ఆర్.బి. కౌల్, కన్సల్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కె.మనోహరన్, డైరెక్టర్ వ్యవసాయశాఖ, ఎస్.కె. కుషువహా, ఎస్.ఈ రవాణాశాఖ, ఎమ్.రఘురామ్, ఎస్.ఈ కేంద్ర జలవనరుల శాఖ ఉన్నారు.

HMTV

HMTV

Next Story