విజయవాడవరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విజయవాడ
వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ బస్సులు కూడా నడపక పోవటం ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల శాడిజానికి పరాకాష్ట కాదా? - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
పండుగ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య ఈ దసరా పండుగ నుంచైనా ఆర్టీసీ బస్సులు నడపాలి.
రైళ్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తెలంగాణ ఎపీల మధ్య రాకపోకలకై ఆర్టీసీ బస్సులే ఆధారం.
హైదరాబాద్ వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బడిముబ్బడిగా చార్జీలు వసూలు చేస్తున్నాయి.
పండుగల సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాంతాలనుంచి ఏపీలోని స్వస్థలాలకు రావాలనుకున్న వారికి నిరాశ ఎదురవుతున్నది.
- రామకృష్ణ.
Next Story



