తూర్పుగోదావరి ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-21 04:56:21

తూర్పుగోదావరి

ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని నమ్మించి, రూ.లక్షకుపైగా నగదు దోచేసిన ఓ అగంతకుడు

రాజమండ్రి- ప్రకాశంనగర్‌ పోలీసు స్టేషన్ పరిధి శ్యామలానగర్‌ లో ఘటన

ఎ.శ్రీనివాసశర్మకు ఈ నెల 16న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌

మీ పేటీఎం యాప్‌ అప్‌డేట్‌ చేయాలి... ఆధార్‌, ఇతర వివరాలు చెప్పాలని కోరిన ఆ అగంతకుడు

ఆ అగంతకుడు చెప్పిన మాటలు నమ్మిన శర్మ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా చెప్పేశాడు

దీంతో రెండు దఫాలుగా మొత్తం రూ.1.09 లక్షలను శర్మ బ్యాంకు ఖాతా నుంచి అగంతకుడు తన ఖాతాకు ఆన్‌లైనులో దోచేశాడు

నగదు డ్రా చేసినట్లు బ్యాంకు నుంచి సంక్షిప్త సందేశాలు రావడంతో కంగారు పడిన శర్మ బ్యాంకును సంప్రదించాడు.

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శర్మ ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

HMTV

HMTV

Next Story