అమరావతి....hmtv తో డిప్యూటీ సీఎం ధర్మాన... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-19 05:54:31

అమరావతి....

hmtv తో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్...

ఇటీవల నా వ్యాఖ్యలు వక్రీకరించి రాద్ధాంతం చేస్తున్నారు..

నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చెయ్యలేదు..

నాపై ఇప్పటివరకూ ఎలాంటి ఆరోపణలు లేవు.. ఇటీవల కావాలని సృష్టిస్తున్నారు..

వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పనులు కాస్త మార్చాలని అధికారులకు సూచన చేశా..

ఉపాధి హామీ పనుల వల్ల వ్యవసాయ పనులకు ఎవరూ రావడం లేదు.. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

ఉపాధి హామీ పథకం చాలా గొప్పది.. లక్షలాది మందికి ఉపాధి వచ్చింది..

రైతులు స్వార్ధ రాజకీయ నాయకుల వలలోకి పడకూడదు అనేది నా విన్నపం..

రైతులు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను..

ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించాలేగాని.. చేసిందల్లా తప్పు అనేలా ఉండకూడదు..

సరైన విమర్శలు చేస్తేనే ప్రతిపక్షం అనిపించుకుంటుంది..

బీసీలకు చంద్రబాబు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు.. న్యాయం చెయ్యలేదు..

టీడీపీ బీసీలను కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే వాడుకుంది..

సీఎం జగన్ బీసీలు గర్వపడేలా అవకాశాలు ఇస్తున్నారు..

HMTV

HMTV

Next Story