అమరావతిట్విట్టర్ లో టిడిపి జాతీయ... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 07:42:49

అమరావతి


ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...


వైసీపీ ఇసుకాసురులు బరితెగించారు.


ఇసుక దొరక్క, పనులు లేక పస్తులుండి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.


ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు మింగుతున్న వైసీపీ నేతలు రోడ్ల మీద వీరంగం వేస్తున్నారు.


అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లో ఎమ్మెల్యే బంధువు దుద్దకుంట సురేందర్ రెడ్డి రోడ్డు మీద తప్పతాగి హల్ చల్ చేసాడు.


అడ్డొచ్చిన ఎస్సై శరత్ చంద్రగారిపై తిరగబడి వార్నింగ్ ఇచ్చాడు.


ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే అరెస్ట్ చెయ్యమని ఒత్తిడి చేస్తున్న కొంతమంది అధికారులకు వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు కనిపించడం లేదా....?


వైసీపీ నేతల నుండి పోలీసులకే రక్షణ లేనప్పుడు ఇక ప్రజల పరిస్థితి ఏంటి?


HMTV

HMTV

Next Story