చామకూర మల్లారెడ్డి రాష్ట్ర... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 04:54:21

చామకూర మల్లారెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి


రోగులకు వీఐపీల తరహాలో చికిత్స అందించిన నాడే తీసుకుంటున్న జీతానికి న్యాయం చేసిన వారవుతారని ఈఎస్ఐ అధికారులకు మంత్రి మల్లా రెడ్డి సూచించారు.


ప్రతినెలా కోట్ల రూపాయల ఇండెంట్లు పంపుతున్నా... ఇప్పటికీ ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో మందుల కొరత ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈఎస్ఐ అధికారులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్ క్యాంపస్​లో మంత్రి సమీక్షా సమావేశం.


ఇకపై ప్రతినెలా రోగులకు అందించిన మందుల వివరాలను ఆన్​లైన్ లో ఉంచాలని ఆదేశించారు.


అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన సిబ్బందిని నియమించాలి.


ఎలాంటి తప్పులు దొర్లకుండా ఈఎస్ఐలో సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.


HMTV

HMTV

Next Story