మధ్యాహ్నం ప్రగతి భవన్ లో... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 05:18:53

మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పై రివ్యూ.

ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం.

పట్టభద్రుల ఓటర్ నమోదు సీరియస్ గా తీసుకోవాలని అన్ని జిల్లాల ఎమ్మెల్యేలకు సూచించనున్న సీఎం.

ఒక్కొక్క జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్న సీఎం కేసీఆర్.

గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదుల పై ఇప్పుటికె ప్రజలకు అవగహన కల్పిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎవరు అనేది ఎమ్మెల్యే లకు సూచించనున్న సీఎం కేసీఆర్..

ప్రగతి భవన్ కు వచ్చే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మధ్యాహ్నం భోజనం కూడా ప్రగతి భవన్ లో ఏర్పాటు చేయాలని సిబ్బంది కి ఆదేశించినట్లు సమాచారం.

HMTV

HMTV

Next Story