విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పొలిటికల్‌ జేఏసీ... ... Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-26 05:34:48

విశాఖపట్నం: 

ఉత్తరాంధ్ర పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ జేటీ రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు.

కోవిడ్‌ 19 కారు పాసులను తయారు చేసి విక్రయిస్తున్నాడని..జేటీ రామారావును మహారాణిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జేటీ రామారావు అరెస్ట్‌ కావడం ఇది మూడోసారి.

2016లో విజిలెన్స్‌ అధికారినంటూ డబ్బులు వసూలు చేసిన కేసులో అరెస్ట్ అవగా...

ఈ ఏడాది ఫ్రిబ్రవరి 25న చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలో ఆత్మహత్యాయత్నమంటూ హల్‌చల్‌ చేసిన సందర్భంలో రెండోసారి జేటీ అరెస్ట్ అయ్యారు. 

HMTV

HMTV

Next Story