ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-03 10:32:18

ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

గురువారం బిఆర్ కెఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సి.యస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

శాసన మండలి, శాసన సభ లో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు.

వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు.

శాసన మండలిలో సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆదేశించారు.

సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్ ను అధికారులు సిద్ధం చేసుకొని ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో స్పెషల్ సి.యస్ శ్రీమతి రాణి కుముదిని, ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, శ్రీ వికాస్ రాజ్, శ్రీ రజత్ కుమార్, శ్రీ సునీల్ శర్మ, శ్రీ రవిగుప్త, శ్రీ సంతోష్ రెడ్డి, లా సెక్రటరీ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

HMTV

HMTV

Next Story