శ్రీకాకుళం జిల్లా..సంతబొమ్మాళి యువతిపై కుల పెద్దల... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

శ్రీకాకుళం జిల్లా..

సంతబొమ్మాళి యువతిపై కుల పెద్దల లైంగిక వేదింపుల కేసులో కొత్త ట్విస్ట్..

కుల పెద్దలని వెనకేసుకు వస్తోన్న యువతి తల్లి దండ్రులు..

సంతబొమ్మాలి లైంగిక వేధింపులు బాధితురాలు తండ్రి కృష్ణా రావు కామెంట్స్..

నా కూతురు విషయంలో నాలుగు సార్లు చర్చలు జరిగాయి..

పెద్దమనుషులు, పోలీసులు కలిసి 18 లక్షలకు రాజీ కుదిర్చారు..

అందులో మా కుటుంబానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు..

కులపెద్దల జోక్యంతో 8 లక్షలు మాకు ఇచ్చారు..

కులపెద్దలు 10 లక్షలు తీసుకున్నారు అనేది వాస్తవం కాదు..

అన్నీ పోలీసుల సహకారంతో నిందితుడు లక్ష్మణరావు, అతని కుటుంబ సభ్యులు చేస్తున్నారు..

మానవ హక్కుల సంఘం ప్రతినిధి డబ్బులు తీసుకున్నారు అనేది అబద్దం..

మేము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు..

కులపెద్దలపైన అన్యాయంగా నా కూతురుతో కేసు పెట్టించారు..

నా కూతురుని నారాయణ, లక్ష్మణ రావు, అతని కుటుంబ సభ్యులు కలిసి కిడ్నాప్ చేశారు..

45 రోజులుగా నా కూతురు ఎక్కడ ఉందో తెలియదు..

పోలీసులకు ఫిర్యాదు చేద్దామని స్టేషన్ కి వెళ్తే నీ కూతురు మేజర్ కేసు పెట్టడానికి అవకాశం లేదని సమాధానం చెప్పారు..

నా కూతురు కనిపించడం లేదంటే పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు..

ఇప్పుడు కులపెద్దల మీద , గ్రామ పెద్దల మీద కేసు పెట్టడం ఏమిటి ?

Show Full Article
Print Article
Next Story
More Stories