అమరావతిబొండా ఉమామహేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేఅడ్డగోలు... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 12:00:44

అమరావతి

బొండా ఉమామహేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే

అడ్డగోలు దోపిడీ తప్ప, అభివృద్ధి ఎక్కడుంది...?

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న ముగ్గురు మూర్ఖులు జోగిరమేశ్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీ నివాస్ కాసుల కక్కుర్తి కోసం విజయవాడ నగరాన్ని నాశనం చేశారు.

కనకదుర్మమ్మ ఫ్లైఓవర్ కడతామంటే, ఆనాడు వద్దని ధర్నాలు చేసింది ఈ ముగ్గురు బఫూన్లు కాదా?

చంద్రబాబు ప్రతిపక్షనేతగా విజయవాడలో జరిగిన ధర్నాకు వచ్చి, ఫ్లైఓవర్ కడతానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే కట్టి చూపించారు.

ఎవరికో పుట్టిన బిడ్డకు పేరుపెట్టి, ఎత్తుకొని ఆడించినట్లుగా వైసీపీనేతలు దాన్ని మేమే కట్టామని చెప్పుకుంటున్నారు.

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలా తయారయ్యాడు.

సింహాచలం దేవాలయ భూములను, కనకదుర్గమ్మ గుడిలో కోట్లాది రూపాయలను, అన్నవరం సత్యదేవుని ఆలయంలో సొమ్ముని దిగమింగుతున్నారు.

శ్రీశైలం ఆలయంలో టిక్కెట్ల కుంభకోణంతో దండుకున్నారు.

గుంటూరు ఎమ్మెల్యే గుట్కా ప్యాకెట్లు అమ్ముకుంటున్నాడు.

కర్నూల్లో ఒకమంత్రి పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ దండుకుంటున్నాడు.

విజయవాడలో మంత్రేమో కరోనా పేరుచెప్పి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలుచేశారు.

ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ప్రజలనుంచి, వ్యాపారుల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకుంటున్నారు.

HMTV

HMTV

Next Story