నక్కా ఆనందబాబు మాజీ మంత్రి దళితుల జుట్టంటే... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 11:59:12

నక్కా ఆనందబాబు మాజీ మంత్రి

దళితుల జుట్టంటే ప్రభుత్వానికి అంత వ్యామోహమా...?

దళితులపై వరుస శిరోముండనాలు జరుగుతున్నా పట్టించుకోనిది అందుకేనా...?

దళితులపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలో జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.

మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా జరుగుతున్న దారుణాలను సమర్థించుకుంటున్నారు.

టీడీపీపాలనలో పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేకుండా జరిగిన ఒకటి రెండు ఘటనలతో, ఇప్పుడు జరిగే ఆకృత్యాలను ముడిపెట్టాలని చూస్తున్నారు.

విశాఖలో దళితయువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన నూతన్ నాయుడు, అతని భార్యను తక్షణమే అరెస్ట్ చేయాలి.

ఓంప్రతాప్ మృతిపై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలి.

HMTV

HMTV

Next Story