సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-28 12:21:48

సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి....

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం గొల్లపల్లి మండలం గుట్ట గూడెం అన్నపురెడ్డిపల్లి లో 400 ఎకరాల భూమిని 110 మంది ఆదివాసీ గిరిజనులు 22 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నారు...

ఈ భూముల్లో పత్తి నువ్వులు జీడి తోటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు...

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పత్తి పంటను వేశారు...

ప్రతి మొక్కలు ఏపుగా పెరిగే క్రమంలో సాయుధ బలగాలు 70 మంది ఫారెస్ట్ ఆఫీసర్ రెండు వందల మంది పోలీసులు వచ్చి పంటను ధ్వంసం చేయడం అన్యాయం...

ఎంతో కష్టపడి పంట సాగు చేస్తుంటే ధ్వంసం చేయడం సమంజసమా...?

19 మంది గిరిజనుల పై కేసులు పెట్టారు...

గిరిజనుల పై కేసులు ఉపసంహరించుకొని భూములను సాగు చేస్తున్న సాగుదరులకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి....

HMTV

HMTV

Next Story