మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-24 10:43:49

మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్...

రేపు అత్యంత కీలకమైన సి డబ్ల్యూ.సి సమావేశం ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సోనియా గాంధీ గారికి లేఖ రాయడం అది మీడియాకు లీక్ చేయడం బాధాకరం..

పార్టీ అంతర్గత విషయాలు పార్టీ వేదికల మీద ప్రస్తావించాలి.. ఇది పార్టీ కి అన్ని విధాలా మంచిది..

ఇలాంటి లేఖలు, లీకులు పార్టీలో మంచి పరిణామం కాదు..

గాంధీ కుటుంభం అంటే ఈ దేశానికి ఆదర్శం, జీవితాలను, ప్రాణాలను త్యాగాలు చేసిన కుటుంబం..

ఈ దేశ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంభం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది..

గాంధీ కుటుంభం నుంచే ఏఐసీసీ అధ్యక్షులు ఉండాలి. ఆ కుటుంభం పదవుల కోసం ఆశపడే కుటుంభం కాదు...

ఇది దేశంలో ప్రతి కార్యకర్త కోరుకుంటున్న విషయం..

సీనియర్లు కూడా పార్టీ బాగు కోసమే ఆలోచిస్తున్నారు. కానీ ఈ రకంగా లేఖల ద్వారా అభిప్రాయాలు చెప్పడం.. దాన్ని లీక్ చేయడం పార్టీకి శ్రేయస్కరం కాదు..

HMTV

HMTV

Next Story